68 వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

68 వినతుల స్వీకరణ

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

68 వినతుల స్వీకరణ

రాయగడ:

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెంది న వారి నుంచి 68 వినతులను స్వీకరించారు. జిల్లా అదనపు కలక్టర్‌ నవీన్‌ చంద్రనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వీకరించిన వినతుల్లో 53 వ్యక్తిగత సమస్యలున్నాయి. మరో 15 గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. గ్రామ సమస్యలను సంబంధితశాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహ క అధికారి అక్షయ కుమార్‌ ఖెముండొ, ఏఎస్పీ గొసేన్‌ బర్లా, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్‌ సరోజినిదేవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చంద్రకాంత్‌ మాఝి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

వినతుల వెల్లువ

పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు అధిక స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుంచే ప్రజా సమస్యలు వినడానికి అదనపు జిల్లా మాజిస్ట్రేట్‌ ఫల్గుణీ మఝి విచ్చేశారు. అదనపు ఎస్పీ సునీల్‌ కాంత మహంతి, జిల్లా పరిషత్‌ సి.డి.ఓ దయామయ పాడీ, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా తదితరులు హాజరయ్యారు. గ్రీవెన్స్‌కు పర్లాకిమిడి పురపాలక, రాణిపేట, సిద్ధమణుగు గ్రామ పంచాయతీల నుంచి 60 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 49, గ్రామ సమస్యల కు సంబంధించినవి 11 ఉన్నాయి. రేషన్‌ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, ప్రథానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్ల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. నువాగడ బ్లాక్‌లో లిబిరిగూడలో తాగునీటికి అవస్థలు పడుతున్నట్టు గ్రామస్థులు ఏ.డి.ఎంకు వినతిపత్రం అందజేశారు. సి.డి.ఎం.ఓ డాక్టర్‌ శంతుని పాడీ, గుసాని బి.డి.ఓ గౌరచంద్ర పట్నాయక్‌, తహసీల్దార్‌ నారాయణ బెహరా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement