రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట సమీపంలోని బాబాయ్‌ హోటల్‌ దగ్గర ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన హనుమంతు వనజాక్షి (38) మృతి చెందారు. ఈమె భర్త కామేశ్వరరావుకు కాలికి గాయాలయ్యాయి. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై ఎచ్చెర్ల బంధువుల ఇంటికి పరా మర్శకు వెళ్తుండగా.. బాబాయ్‌ హొటల్‌ వద్దకు వచ్చే సమయంలో రాత్రి 9 గంటలకు ఎదురుగా ఒడిశాకు చెందిన బొలేరో వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో దంపతులు గాయపడ్డారు. వీరిని వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వనజ మృతి చెందారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి జ్ఞానేశ్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. సాత్విక్‌ 10వ తరగతి ఎగ్జామ్‌ రాశాడు. కామేశ్వరరావు ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. వనజ మృతిని తెలుసుకున్న బంధువులు రిమ్స్‌ ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఎచ్చెర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement