అలరించిన నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన నాటిక పోటీలు

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

కవిటి: బొరివంక కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటిక పరిషత్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మచెక్కిన బొమ్మ, స్వప్నంరాల్చిన అమృతం అనే రెండునాటికలు ప్రదర్శించారు. గోదావరి క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారు ప్రదర్శించిన అమ్మచెక్కిన బొమ్మ సమాజంలో పెరుగుతున్న ఆస్తి కాజేసే మోసాలు, అమాయక యువతులపై జరుగుతున్న మోసాలు ఇతివృత్తంగా సాగింది.

అనంతరం కరీంనగర్‌ చైతన్యకళాభారతి సంస్థ వారు ప్రదర్శించిన స్వప్నం రాల్చిన అమృతంనాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement