గోవిందా హరి గోవింద | - | Sakshi
Sakshi News home page

గోవిందా హరి గోవింద

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

భువనేశ్వర్‌: ఖుర్దా రోడ్డు అకౌంట్సు కాలనీ కొండపై నెలకొని ఉన్న బాలాజీ మందిరం 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పవిత్ర చైత్ర శుద్ధ చతుర్దశి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు చైత్ర బహుళ తదియ (ఆది వారం) వరకు జరిగాయి. ఈ సందర్భంగా నిత్యం ఉదయం మంగళ ధ్వని మొదలుకొని సాయంత్రం వరకు నిర్వహించిన పలు ప్రత్యేక పూజాదుల్లో ఔత్సాహిక భక్తులు పాలుపంచుకున్నారు. నిత్యం రెండు పూట ఉత్సవ మూర్తుల్ని చంద్ర ప్రభ, గరుడ, అశ్వ, హనుమత్‌, సూర్య ప్రభ వాహనాలపై జట్నీ పుర వీధుల్లో ఊరేగించారు. బాల బ్రహ్మానంద సరస్వతి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా వైభవం ప్రవచనం తదితర ఆకర్షణీయ కార్యక్రమాలతో దేవస్థాన ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది.

సౌభాగ్య లక్ష్మి కుంకుమ అర్చనలో పాల్గొన్న మహిళా సమూహం

Advertisement
 
Advertisement
Advertisement