మల్కన్‌గిరి: ఒడియా భాషపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా దుకాణాలు, ప్రైవేట్ బస్సులు, మాల్స్‌పై ఒడియా భాషలో నేమ్‌ప్లేట్లు రాయాలని సూచిస్తూ శనివారం ర్యాలీలు చేపట్టారు. స్థానిక బస్‌స్టాండ్ నుంచి డీఎన్‌కే క్రీడా మైదానం వరకు ర్యాలీ సాగింది. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అరవింద్ రాజశిర్కే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుడూ.. ఒడియా మన మాతృభాష అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వ్యాపార సంస్థలు, కార్యాలయాలలో ఒడియా భాషలో పేరు, ఫలకాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని..మన భాష, సంస్కృతిపై మన గర్వానికి ప్రతీక అన్నారు. మల్కన్‌గిరి ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించి తమ దుకాణాలు, సంస్థలలో ఒడియా పేరు ఫలకాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు .ఈ అదనపు జిల్లా కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, జిల్లా అదనపు కలెక్టర్ వేధ్బర్‌ప్రధన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్‌బోయి, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


