పర్లాకిమిడి: స్థానిక డోలాట్యాంకు రోడ్డులోని సెయింట్ జోసఫ్ కాథలిక్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. దీన్న పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఏటా గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో మనం మరొకరి ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుందని చర్చి ఫాదర్ అజిత్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా 61 సార్లు రక్తదానం చేసిన అట్టాడ రమేష్, 32 సార్లు రక్తదానం చేసిన కె.వరదరాజును దుశ్శాలువతో సన్మానించారు.
రక్తదాన శిబిరంలో సీడీఎంవో, జిల్లా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శంతును పాఢి, డాక్టర్ రమ్య, డాక్టర్ అనప్తి, ప్రేం రంజన్ నాయక్ పాలొన్నారు. 60 యూనిట్ల రక్తాన్ని సేకరంచినట్టు సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహారా తెలిపారు.


