బాక్సింగ్ పోటీల్లో సిక్కోలు పంచ్
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రపోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు శ్రీకాకుళం జిల్లా తరఫున రికార్డుస్థాయిలో పదిమంది బాక్సర్లు జె.తారక్, పి.ప్రసాదరావు, సీహెచ్ జ్ఞానేశ్వరరావు, పి.మణికంఠ, పి.విశ్వేశ్వరరావు, ఎం.లోకేష్, ఎస్.ఏసు, డి.మనోజ్‌కుమార్, ఎం.సతీష్, ఎం.లోకేష్ ఎంపికయ్యారని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్(అను) తెలిపారు. జిల్లా బృందానికి కోచ్‌గా పి.అప్పలరాజు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వీరంతా శుక్రవారం సాయంత్రం ఇక్కడి నుంచి పయనమై విజయవాడ వెళ్లారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు, రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.


