ముందు జాగ్రత్తలే మేలు..
చలికాలంలో ముందు జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు చల్లని గాలిలో, మంచు పట్టిన సమయంలో బయట తిరగటం మంచిది కాదు. అలర్జీలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
– డాక్టర్ జి.వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరిటెండెంట్, పాతపట్నం
చలి నుంచి రక్షణకు చిన్నారులకు స్వెటర్లు, వేడి నీటితో స్నానం చేయించాలి. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
– డాక్టర్ వి.మన్మధరావు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, సీహెచ్‌సీ, పాతపట్నం
ముందు జాగ్రత్తలే మేలు..


