ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర

Jun 9 2025 7:50 AM | Updated on Jun 9 2025 7:50 AM

ఆదివా

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర

● భారీగా తరలివచ్చిన భక్తులు ● ఈ ఏడాది వర్షాలు ఎలా పడతాయో వెల్లడించిన పూజారులు

జయపురం: ఆదివాసీ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారు జరుపుకునే పండుగలు వారి జీవన విధానంతో ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో బిరిపాణి జాతర ఒకటి. ఈ జాతర ద్వారా వర్ష రుతువులో పడే వర్షాలపై అంచనా వేస్తారు. వర్షాలు బాగా పడతాయా, లేదా, ఈ కాలంలో ఎలాంటి పంటలు వేస్తే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది మొదలగు విషయాలు తెలుసుకోవడానికి జయపురం సమితి గొడొపొదర్‌లో బిరిపాణి జాతర జరుపుకుంటారు. ఈ అశాసీ్త్రయ నమ్మకం శతాబ్దాల కాలం నుంచి ఆదివాసీల్లో ఉంది. శాస్త్రవేత్తలు రుతుపవనాల కదలికలు, వర్ష పాత సూచనలు తెలియజేస్తూ ఉంటారు. అయితే వారు గణాంకాలు కొన్ని సమయాలలో తప్పు కావచ్చు. కాని బిరిపిణి జాతార ద్వారా ఆదివాసీ శిశాలు, దిశారీలు రుతపవనాలపై వేసే అంచనాలు తప్పవని నమ్ముతారు. వర్ష రుతువులో వర్షాల ఏవిధంగా పడతాయి, పూజారి ఏమి చేపుతాడో తెలుసుకునేందుకు ఆదివాసీ గ్రామాల నుంచి శనివారం బిరిపాణి జాతర జరిగే జయపురం సమితి గొడపోదర్‌ గ్రామానికి తరలి వచ్చారు. ఈ పండుగ జయపురం సమితి గొడొపొదర్‌ గ్రామంలో ఏటా అంగరంగవైభవంగా జరుగుతుంది. శనివారం జరిగిన బిరిపాణి జాతరకు అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది ఆదివాసీలు వారి గ్రామ దేవతల లాఠీలతో తరలివచ్చారు. ముందుగా గ్రామ నచి బొడ్డున గల బిరిపాణి దేవి మందిరంలో పూజలు చేశారు. దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంటివద్ద గ్రామ దేవతల లాఠీలకు పూజలు చేయగా అచ్చట నుంచి గ్రామానికి దూరంలోని పర్వతంపైకి వెళ్లి అక్కడ ఉన్న దేవత విగ్రహాలకు పూజలు చేశారు. గ్రామ పూజారి కలుగులో చేయి పెట్టి అందులో ఉన్న నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని అంచనా వేశారు. జాతరలో పాల్గొన్న భక్తులు బిలం నుంచి వచ్చే నీటిని బాటిళ్లలో పట్టుకొని తీసుకొని వెళ్లారు. అ నీటిని పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం.

200 ఏళ్లుగా జాతర..

200 ఏళ్లుగా ప్రసిద్ధ బిరిపాణి జాతర జరుగుతుంది. బిరిపాణి దేవి సత్యమైన తల్లి అని.. జయపురం మహారాజుల కాలం నుంచి ప్రజలు ఈ పండుగ జరుపుతున్నారని గ్రామ పంచాయతీ మందిర పూజారి వెల్లడించారు. అనాతిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం తాము ఈ పూజలు చేస్తున్నామని.. ఈ పూజ ద్వారా వర్షపాతం ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. వర్షకాలంలో అతివృష్ట, అనావృష్ట లేక సాధారణ వర్షమా అని పూజారి చెబుతారని.. అందుకు తగ్గట్టుగా పంటలు వేసుకుంటామన్నారు.

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర 1
1/4

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర 2
2/4

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర 3
3/4

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర 4
4/4

ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement