
తాగునీటి కోసం ఆందోళన
పర్లాకిమిడి: కాశీనగర్ ఎన్‌ఏసీలో తాగునీటి సమస్య తీర్చాలని కోరుతూ మహిళలంతా కలిసి సమితి కార్యాలయం ఎదుట బిందెలు, బకెట్లతో శుక్రవారం ఆందోళన జరిపారు. దీనిలో భాగంగా కాశీనగర్ ఎన్‌ఏసీ బ్లాక్ ఆరోగ్య కేంద్రం రోడ్డులో వాహనాలను నిలిపివేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గత ఆరు నెలలుగా కాశీనగర్ ఎన్‌ఏసీ, గ్రామీణ తాగునీటి శానిటేషన్ ఇంజినీర్లు, కాశీనగర్ బీడీవోకు తాగునీటి కోసం మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదని, అందువల్ల ఆందోళన చేస్తున్నామని మహిళలు పేర్కొన్నారు. వెంటనే పోలీసు అధికారులు చొరవ తీసుకుని ప్రైవేటు వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేశారు.

తాగునీటి కోసం ఆందోళన