కరోనా అభాగ్యులకు ‘ఆశీర్వాద్‌’ సాయం

- - Sakshi

● ప్రతి నెలా రూ.2,500లు అందిస్తున్న రాష్ట్రప్రభుత్వం ● అసెంబ్లీలో సమాధానమిచ్చిన మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి బాసంతి హెంబ్రామ్‌

భువనేశ్వర్‌: కరోనా మహమ్మారి తాకిడితో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాగోగులను ప్రభు త్వం పర్యవేక్షిస్తోంది. వైరస్‌ ప్రభావంతో పలువురు బాలలు తల్లిదండ్రులను, మరికొందరు ఇరువురిలో ఎవరో ఒకరిని పోగుట్టుకున్నారు. అటువంటి వారందరికీ 18ఏళ్లు నిండేంత వరకు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. పలువురు బాలలకు శిశు సంరక్షణ హాస్టల్‌లో ఆశ్రయం కల్పించారు. మరి కొందరిని ఆత్మీయులు, బంధువర్గాలు సంరక్షిస్తున్నారు. ఈ రెండు వర్గాల బాలలకు ప్రభుత్వం ఆర్థిక సా యం ప్రకటించింది. దీనికోసం ఆశీర్వాద్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ –19తో 50,952మంది పిల్లలు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయినట్లు రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. వీరందరినీ ఆశీర్వాద్‌ పథకం కింద జోడించా మని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి బాసంతి హెంబ్రామ్‌ వెల్లడించారు. శాసనసభలో కొనసాగుతున్న బడ్జెట్‌ సమావేశాలు పురస్కరించుకుని శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో మంత్రి ఈ వివరాలను లిఖిత పూర్వకంగా ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.

కేంద్రం నుంచి 108మందికి..

తల్లిదండ్రులు కోల్పోయిన ప్రతి బిడ్డకు ప్రభుత్వం నెలకు రూ.2,500లు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. కుటుంబ పోషకులు కరోనా బారినపడి అకాల మరణానికి గురైన పరిస్థితుల్లో బాలలకు నెలకు రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. శిశు సంరక్షణా సంస్థలో ఆశ్రయం పొందిన ఈ కోవ కు చెందిన ప్రతి చిన్నారికి రూ.వెయ్యి మంజూరు చేస్తున్నారు. బిడ్డకు 18 ఏళ్లు నిండే వరకు ఈ సహాయం కొనసాగుతోందని మంత్రి లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు. 2020 ఏప్రిల్‌ 1నుంచి కోవిడ్‌–19 విపత్తు తొలగేంత వరకు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆశీర్వాద్‌ పథకం కింద లబ్ధిదారులుగా పరిగణిస్తారు. కోవిడ్‌–19 మహ మ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన రాష్ట్రానికి చెందిన 108 మంది బాలలకు ప్రధానమంత్రి కేర్స్‌ పథకం కింద సాయం అందుతోంది.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top