టీడీపీ పాలనలో ఆలయాల ధ్వంసం.. వాటిని పునర్ నిర్మించిన జగన్ నాడు చెత్తబండిలో విగ్రహాలు.. నేడు వైభవంగా పూజలు వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అభివృద్ధి పేరుతో ఆలయాలను ధ్వంసం చేసి చెత్త బండిలో విగ్రహాలను తరలించిన హిందూ ద్రోహులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీతమ్మవారి పాదాల వద్ద గల శ్రీ దక్షిణ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించిన వెలంపల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణుతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఇక్కడ దశాబ్దాలుగా వెలిసి ఉందన్నారు. కానీ 2014–2019 మధ్య అధికారంలో ఉన్న నాటి కూటమి ప్రభుత్వం కృష్ణా పుష్కరాల వంకతో ఈ దేవాలయాన్ని అత్యంత దుర్మార్గంగా కూల్చివేసిందన్నారు. కనీసం శాస్త్రోక్తంగా వైధిక పనులు చేయకుండా, స్వామి వారి విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చెత్తబండిలో వేసి తరలించిన తీరు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందన్నారు.
వైఎస్ జగన్ చొరవతోనే..
2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. చంద్రబాబు హయాంలో కూల్చివేతకు గురైన ఆల యాలన్నింటినీ జగన్ పునర్నిర్మించారన్నారు. ఫలితంగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంత మంది భక్తులు ఇక్కడ స్వామి వారిని కొలుచుకుంటున్నారంటే అది కేవలం జగన్‌మోహన్‌రెడ్డి భక్తి, ధర్మంపై ఆయనకున్న గౌరవం వల్లనే సాధ్యమైందన్నారు.


