విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026 పులిచింతల సమాచారం సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘నీవు ఆదరిని, నేను ఈదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే సినీపాట ప్రేక్షకాదరణ పొందింది. విభజిత కృష్ణా జిల్లాలో ప్రజాప్రతినిధుల తీరు అందుకు పూర్తి భిన్నం. ఎవరికి వారు అయిపోయారు. ఒకరితో ఒకరికి సఖ్యత లేదు. దోపిడీలో ఒకరికి ఒకరు అడ్డు వస్తున్నారనే నెపంతో.. వేరు వేరు దారులు ఎంచుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలను వదిలేసి, బెజవాడ కేంద్రంగా దందాలు చేస్తున్నారు. పార్లమెంటు ముఖ్యనేతదీ అదే తీరు.. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, తమ పరిధిలో జరిగే కార్యక్రమాలకు పిలువక పోవడంతోపాటు, పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో, ఎటు వెళ్లాలో తెలియక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అప్పుడప్పు డు నియోజకవర్గంలో మెరిసి, తన గొప్పలు చెప్పు కొని మాయం అవుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఓ సమీక్షలో ప్రజా ప్రతినిధులు అందరిపైనా చిర్రు బుర్రులాడారు. జిల్లాలో పర్యటించిన సందర్భంలో సైతం ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కన్నెత్తి చూడకపోగా, మరో ప్రజా ప్రతినిధిపై ఏకంగా నియోజకవర్గం టీడీపీ నాయకులు, అధికార సమక్షంలో తీవ్రంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. మీరు మారకపోతే నేను మార్చేస్తానంటూ, పరోక్షంగా హెచ్చరించడం టీడీపీ నాయకుల్లో సైతం హాట్‌ టాఫిక్‌గా మారింది. మంత్రితో కొరవడిన సఖ్యత.. జిల్లాలో అన్నీ తానై వ్యవహారాలు చూసే ఓ మంత్రి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు అసలు పొసగడం లేదు. మంత్రితో ఏడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకు పూర్తిగా సఖ్యత కొరవడింది. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశాలకు సైతం ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో వైఎస్సార్‌ సీపీని ఎదుర్కొవడంలో ఐకమత్యంగా లేరని బాబు సైతం క్లాస్‌ పీకారు. ప్రధానంగా నలుగురు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండటం లేదని, బెజవాడలో కాపురం ఉంటూ, తమ కార్యకలాపాలు నెరపుతున్నారని, అవినీతి పద్దులు చూసుకొనేందుకు మాత్రమే నియోజకవర్గాలకు వస్తున్నారనే చర్చ తమ పార్టీ వర్గాల్లోనే సాగుతోంది. మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో ఉంటూ చుట్టపు చూపుగా వస్తున్నారని, వారిపై తమ నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందనే భావన సొంత పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ప్రధానంగా కొత్తగా ఎన్నికై న ముగ్గురు ప్రజా ప్రతినిధులు, డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకొనే రీతిలో వ్యవహరిస్తూ, ప్రజలను, పార్టీ నాయకులను పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపం.. పార్లమెంటు ముఖ్యనేత.. పార్లమెంటు పరిధిలో ముఖ్యనేత పరిస్థితి దయనీయంగా ఉంది. ఏడు నియోజకవర్గాలో ప్రజా ప్రతినిధులు, తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు పిలవక పోగా, నియోజకవర్గాల్లో సైతం తిరగనివ్వటం లేదు. ఓ మంత్రికి ఆయనకు పూర్తిగా పొసగటం లేదు. టీడీపీ శ్రేణులు బహిరంగంగానే ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇటీవల మచిలీపట్నంలో జనసేన నేత ఇల్లు కూల్చిన వ్యవహారంలో సైతం, పార్లమెంటు ముఖ్యనేత బీరాలు పలికి, జనాల్లో పలుచనయ్యారు. కూల్చివేసిన ఇల్లు కట్టిస్తానని చెప్పి, అడ్రసు లేకుండా పోయారని విమర్శలు వస్తున్నాయి. ఓ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో పార్టీ అధినేతకు ఆయనకు దూరం పెరిగింది. దీంతో జనసేన ప్రధాన కార్యాలయంలోకి కూడా పార్ల మెంటు ముఖ్యనేతకు ఎంట్రెన్స్‌ లేకుండా పోయిందని అంటున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గాల్లోకి వచ్చి, అది చేశాను, ఇది చేశాను అని సోషల్‌ మీడియాలో డప్పుకొట్టుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ ముగ్గురిపై గుర్రు..

న్యూస్‌రీల్‌

జిల్లాలోని టీడీపీలో అంతర్యుద్ధం

ఎవరికి వారే ‘కృష్ణా’ తీరే!

వైభవంగా పునఃప్రతిష్ఠ

కలెక్టర్‌ను కలిసిన డీటీవో

పామర్రు, గుడివాడ, గన్నవరం ప్రజా ప్రతినిధుల పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జోరుగా సాగుతోంది. వీరి అవినీతికి అడ్డూ అదుపూలేదని, దీంతో వీరికి ప్రత్యామ్నాయంగా, ఏడాది క్రితం నుంచే నేతలను వెతుకుతున్నట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కొంటున్నాయి. పెడన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి సైతం సైలెంట్‌గా డబ్బు సంపాదనపైనే దృష్టి సారించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి పూర్తి దోపిడీ చేయడం లక్ష్యంగానే పని చేస్తున్నారని, గతంలో డబ్బు లేదని చిన్నచూపు చూశారని, ఈ సారి డబ్బు మూటలతో కనపడతానని ఆయన బహిరంగానే, పార్టీ నేతలతో అంటున్న మాటలు పార్టీలో చర్చనీయాంఽశంగా మారుతున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రితో సైతం గన్నవరం, పెనమలూరు, పామర్రు నియోజకవర్గ నేతలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మంత్రి తీరుపైన ఈ నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4623 టీఎంసీలు.

7

18న దుర్గమ్మ హుండీ కానుకల లెక్కింపు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కులు, ముడుపులను 18వ తేదీన లెక్కించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఆరోజు ఉదయం ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొనున్నారని తెలిపారు. కానుకల లెక్కింపు నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

శ్రీ హనుమత్‌ దీక్షా పీఠంలో శ్రీ వీరాంజ నేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

చిలకలపూడి: కృష్ణాజిల్లా రవాణా అధికారిగా నియమితులైన షేక్‌ సలాం యాకూబ్‌ కలెక్టర్‌ డీకే బాలాజీని కలెక్టరేట్‌లో సోమ వారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఓ మంత్రితో ఎమ్మెల్యేలకు

కొరవడిన సఖ్యత

పార్లమెంటు ముఖ్యనేతతోనూ అదేతీరు

కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులపై

చంద్రబాబు ఆగ్రహం

సీటు మార్చడానికైనా వెనకాడనని లీకులు

Advertisement
 
Advertisement
Advertisement