● జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో
కలెక్టర్ లక్ష్మీశ
● ప్రజల నుంచి 160 అర్జీలు స్వీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి 160 అర్జీలు అందాయని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మొత్తం 160అర్జీలు అందాయని .. వీటిలో రెవెన్యూకి 40, పోలీస్ 23, ఎంఏయూడీ 28, పంచాయతీరాజ్ 10, వైద్య ఆరోగ్యం 8, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 6, విద్యుత్ 5, డీఆర్‌డీఏ 4, ఏపీఎస్ ఆర్‌టీసీ 4, విద్య 4, పౌర సరఫరాలు 3, రవాణా 2, ఎస్సీ కార్పొరేషన్ 2, విభిన్న ప్రతిభావంతులు 2, మార్కెటింగ్ 2, డ్వామా 2, హౌసింగ్ 2, మత్స్య 2, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, మైన్స్, ఉపాధి, సమాచార పౌర సంబంధాలు, ఇరిగేషన్, కార్మిక, దేవదాయ, బ్యాంకింగ్‌కు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చినట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోలులో అక్రమాలు..
ధాన్యం కొనుగోలులో మిల్లర్ల అక్రమాలను అరికట్టి, రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించింది. నాణ్యత సాకుతో క్వింటాకు ప్రభుత్వ నిబంధనల కంటే ఎక్కువ మొత్తంలో తరుగు తీసుకోవడం అన్యాయమన్నారు. అధికారులు మిల్లర్లు కుమ్మకై ్క రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని అర్జీలో పేర్కొన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బుడ్డి రమేష్, రైతులు చెరుకూరు కుటుంబరావు, తాటికొండ రమేష్, చెరుకూరి ఫణీంద్ర తదితరులు ఉన్నారు.


