గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘బడి పిలుస్తోంది’ పేరిట విద్యాశాఖ రూపొందించిన ప్రచార చైతన్య రథాన్ని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ప్రారంభించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ చైతన్య రథం ద్వారా జిల్లాలో ఈనెల 30వరకు ఒక్కో మండలంలో ఒక్కో రోజు చొప్పున బడి పిలుస్తోంది కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. బడి ఈడు పిల్లలు పాఠశాలలో చేరేలా చూడాలన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్‌బాబు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


