ఒకే కుటుంబంలో ముగ్గురికి గిన్నిస్‌ రికార్డు | - | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ముగ్గురికి గిన్నిస్‌ రికార్డు

May 12 2026 5:18 AM | Updated on May 12 2026 5:18 AM

పోలీస్‌ గ్రీవెన్స్‌లో 78 ఫిర్యాదులు

పెనమలూరు: మండలంలోని కానూరుకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు గిన్నిస్‌వరల్డ్‌ రికార్డు సాధించారు. గత ఫిబ్రవరి రెండో తేదీన హైదరాబాద్‌లో 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్‌ వాయిద్యకారులు గంటపాటు కీబోర్డు ప్లే చేశారు. విజయవాడలోని హెల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో శిక్షణ పొందిన కానూరుకు చెందిన దంపతులు పాతూరి సురేష్‌బాబు, స్వర్ణలత తమ కుమార్తె షయాఫేత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకు ఎంపికయ్యారు. హెల్లెల్‌ మ్యూజికల్‌ స్కూల్‌లో రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో వారికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో సోమవా రం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌)లో ప్రజల నుంచి 78 ఫిర్యాదులు అందాయి. పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎ.బి.టి.ఎస్‌.ఉదయరాణి ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకుని, సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలపై 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై ఐదు, మోసాలపై రెండు, మహిళా సంబంధిత నేరాలపై ఏడు, దొంగతనాలపై ఒకటి, ఇతర సమస్యలపై 17 ఫిర్యాదులు అందాయి.

వ్యక్తి అనుమానాస్పద మృతి

ఘంటసాల: మండలంలోని ఘంటసాలపాలెం గ్రామంలో ఓ వ్యక్తి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్‌ఐ వేమన చందన కథనం మేరకు.. బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం ముల్పూరు గ్రామానికి చెందిన ఇంటూరి రమేష్‌ (42) ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వారు ఘంటసాలపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రమేష్‌తో సహజీవనం చేస్తున్న మహిళ అనారోగ్యం బారిన ఊపడి చిట్టూర్పు గ్రామానికి వెళ్లింది. రమేష్‌ ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను సోమవారం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement