న్యూస్‌రీల్
వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది అవినీతికి అడ్డా విజయవాడ రైల్వేస్టేషన్ ఇటీవల ఏసీబీకి చిక్కిన ‘కొండపల్లి’కి అదే అడ్డా నిత్యం కోట్లాది రూపాయల సరుకుల దిగుమతి ఒక్క రోజూ సిబ్బందికి దొరకని వైనం సిబ్బందికి లక్షలాదిగా ఆదాయాన్ని తెచ్చే కేంద్రమిది
ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్న వైనం
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
ఆదాయంపై దృష్టి పెట్టాలి
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ క్లినిక్ కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. దాతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖకు విజయవాడ రైల్వేస్టేషన్ కల్పతరువైంది. ఆ శాఖ సిబ్బంది అవినీతికి అడ్డాగా మారింది. దేశంలోనే కీలక రైల్వేస్టేషన్ ‘విజయవాడ’లో సరుకుల దిగుమతి ఎగుమతులు భారీగా జరుగుతుంటాయి. వాటిలో అనధికార లావాదేవీలే అధికంగా ఉంటాయి. వాటి రాకపోకలు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి వరంగా మారుతున్నాయి. నిత్యం కోట్లాది రూపాయల సరుకు ఇక్కడ దిగుమతి కావటంతో పాటుగా ఎగుమతి సైతం జరుగుతుంటాయి. ఆ సరుకుపై కన్నేసి అందినకాడికి దండుకోవడం వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి అలవాటుగా మారిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇక్కడ అనధికార విధులు నిర్వహించే సిబ్బంది ద్వారా మొత్తం ఆ శాఖకు సంబంధించిన వారందరికీ వాటాలు అందుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
సిబ్బందికి కల్పతరువు
వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి గవర్నరుపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో రైల్వేస్టేషన్ ప్రాంతం ఉంటుంది. ఈ సర్కిల్‌లో బాధ్యతలు నిర్వహించే అందరికీ ఈ రైల్వేస్టేషన్‌పై మంచి పట్టు ఉంటుందని ఆ శాఖ సిబ్బంది చెబుతుంటారు. ఏ సమయంలో ఏఏ రైలులో సరుకులు వస్తుంటాయనేది వారికి బాగా తెలిసి ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్త్రాలు అధికంగా వస్తుంటాయి. ఆయా సమయాల్లో రైల్వేస్టేషన్‌లో కాపు కాసి అందినకాడికి దండుకోవటం పరిపాటైందని వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు.
జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు
ఇటీవల ఏసీబీ దాడుల్లో చిక్కిన గవర్నరుపేట సర్కిల్‌లో పని చేసే కొండపల్లి శ్రీనివాసరావుకు రైల్వే స్టేషన్, దాని పరిసర ప్రాంతాలే అడ్డాగా ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అతని ఇల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండటంతో నిత్యం అనధికారక విధులు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడుతుంటాడని వ్యాపార వర్గాలు వివరిస్తున్నాయి. కొండపల్లికి అండగా ఇతర అధికారులు పని చేస్తుంటారని దీంతో ధైర్యంగా వాహనాలను నిలిపి అనధికారిక తనిఖీలు నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నెల రోజులు డ్యూటీలు వేసినా ఆ శాఖకు రూపాయి ఆదాయం రాని వైనం
ఏటా సంక్రాంతి పర్వదినానికి ముందు నెల రోజుల పాటు రైల్వేస్టేషన్ ద్వారా నగరానికి భారీగా వస్త్ర వ్యాపారానికి సంబంధించిన సరుకు వస్తుంటుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సరుకు అధికంగా వస్తుంటుంది. వన్‌టౌన్‌లో సుమారు వెయ్యికి పైగా ఉన్న వివిధ వస్త్ర దుకాణాలకు చాలా సరుకు స్టేషన్ ద్వారా చేరుతుంటుంది. అధికారులు కాపలా ఒకవైపు ఉంటే మరోవైపు సరుకు బయటకు వెళ్లిపోతుంటుంది. దీనిపై వార్తలు వస్తుండటంతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గడిచిన రెండేళ్లుగా అక్కడ ఆ నెల రోజులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒక్క రూపాయి సైతం పట్టుకున్న దాఖలాలు లేవు. కానీ సిబ్బంది జేబులు భారీగా నిండాయనే ఆరోపణలు మాత్రం బలంగా ఉన్నాయి.
రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ పరిసరాల్లో తనిఖీలు చేసేందుకు రైల్వే అధికారులు అంగీకరించడం లేదనే సాకుతో ప్రభు త్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు రైల్వేశాఖ అధికారులకు లేఖ రాయడం, రైల్వే సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నారు. కానీ స్టేషన్ ప్రాంగణం నుంచి బయటకు వచ్చే సరుకును మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా చూపించిన దాఖలాలు లేవని తెలిసింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు.
రైల్వేస్టేషన్ ద్వారా బయటకు వస్తున్న సరుకును గుర్తించి సకాలంలో తనిఖీలు నిర్వహిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దిశగా సిబ్బంది తీరును మార్చడానికి ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, అవినీతి వసూళ్లలో వాటాలు అందడంతో ఇటీవల అవినీతి సిబ్బంది పుట్టుకొస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దీనికి పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


