విజయవాడ కల్చరల్: అన్నమయ్య సంక్తీనా గాన ప్రచార భక్త బృందం ఆధ్వర్యంలో 15 రోజులుగా నిర్వహిస్తున్న అన్నమయ్య 619 జయంతి వేడకలు వీనుల విందుగా సాగుతున్నాయి. సంకీర్తనా స్రవంతి కార్యక్రమాలను సత్యనారాయణ పురంలోని సీతారామా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమంలో ఆచార్య పప్పు సదాశివశాస్త్రి, కర్నాటక సంగీత విద్వాంసుడు కస్తూరి గోపాలరావు నిర్వహించిన గాత్రయుగళం ప్రేక్షకులను భక్తపారవశ్యంలో ఓలలాడించింది. పలు అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించారు. అన్ని మంత్రములు, చాటెనిదియే, దేవ దేవం భజే, నారాయణతే నమోనమో, నానాటి బ్రతుకు నాటకము వంటి సంకీర్తనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సదాశివశాస్త్రి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా అన్నమయ్య సంకీర్తనలు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
దుర్గమ్మకు పలువురి విరాళాలు
May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM
దుర్గమ్మకు పలువురి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి నలుగురు భక్తుల కుటుంబాలు విరాళాలను అందజేశాయి. విజయ వాడ బ్రాహ్మణ వీధికి చెందిన డి.శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు రూ.1,00,116, గాయత్రీనగర్‌కు చెందిన నాగరం లక్ష్మీప్రసన్న కుటుంబ సభ్యులు ఆలపాటి శ్రీకాంత్, పార్థ సారథి పేరిట రూ.1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అంజేశారు. గుంటూరు జిల్లా తెనాలి గాంధీనగర్ ప్రాంతానికి చెందిన కె.మాధవరావు కుటుంబం కె.రిత్విక్ పేరిట రూ.1,00,116, విశాఖపట్నానికి చెందిన సీహెచ్.దుర్గాప్రసాద్ రూ.1,00,001 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం దాతలను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
వీనుల విందుగా
అన్నమయ్య జయంతి
Advertisement


