ఆగివున్న లారీని ఢీకొని టిప్పర్‌ డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆగివున్న లారీని ఢీకొని టిప్పర్‌ డ్రైవర్‌ దుర్మరణం

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

ఆగివున్న లారీని ఢీకొని టిప్పర్‌ డ్రైవర్‌ దుర్మరణం

గన్నవరం: మండలంలోని చిన్న ఆవుటపల్లి వద్ద వెస్ట్‌ బైపాస్‌పై ఆదివారం తెల్లవారుజామున ప్రమాదంలో టిప్పర్‌ లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఆత్కూరు పోలీసుల కథనం మేరకు.. జి.కొండూరులోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన నాగకృష్ణారావు (34) టిప్పర్‌ లారీ డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో టిప్పర్‌పై ఏలూరు నుంచి విజయవాడ వైపు బయలుదేరాడు. చిన్న ఆవుటపల్లి వెస్ట్‌ బైపాస్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రమాదవశాత్తు టిప్పరు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ ముందు భాగం నుజునుజ్జయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ నాగకృష్ణారావు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ నాగకృష్ణారావును అతికష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నాగకృష్ణారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement