జీవితం దయనీయం | - | Sakshi
Sakshi News home page

జీవితం దయనీయం

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026 గ్రంథాలయ ఉద్యోగులకు వేతన కష్టాలు సాగర్‌ నీటిమట్టం వివరాలు పుట్ట గొడుగులు.. లాభదాయకం నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం – 8లో.. u

న్యూస్‌రీల్‌

మూడు నెలలుగా జీతాలు అందక అవస్థలు డిసెంబర్‌ జీతం ఫిబ్రవరిలో, జనవరిది మేలో.. మరో వైపు పేరుకుపోయిన సెస్‌ బకాయిలు

200 మంది ఎదురుచూపులు

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026
బకాయిల భారం..
గ్రంథాలయ ఉద్యోగులకు వేతన కష్టాలు

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 524.80 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందొచ్చని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. శనివారం పుట్ట గొడుగులపై అవగహన కార్యక్రమం నిర్వహించారు.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ బాలాజీనగర్‌కు చెందిన పడాల సింహాచలం, సుజాత దంపతులు శనివారం రూ.1,01,116 విరాళం సమర్పించారు.

పీఆర్సీ, మధ్యంతర భృతి, పెండింగ్‌ డీఏలు, నెలనెలా వేతనాలపై హామీ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ‘పీఆర్సీ లేదు. ఐఆర్‌ ప్రకటించనే లేదు. పెండింగ్‌ డీఏలు అతీ గతి లేవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల ఊసు అంత కన్నా లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఎన్నికల సమయంలో ఉద్యో గులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. నెలనెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సిన జీతాల కోసం కూడా ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి’.. ఇదీ మంత్రి నారా లోకేష్‌ పర్యవేక్షిస్తున్న పౌర గ్రంథాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితి. గ్రంథాలయ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. పెన్షనర్ల పరిస్థితీ అంతే. డిసెంబర్‌ జీతం ఫిబ్రవరిలో ఇచ్చారు. జనవరి నెల జీతం మే నెలలో చెల్లించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి జీతాల బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రి లోకేష్‌ తన శాఖ పరిధిలో ఉన్న తమ అవస్థలను పట్టించుకోవడం లేదని గ్రంథాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఓ వైపు ఖజానా ఖాళీ అంటూనే మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని, తాము ఏ పాపం చేశామని జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

పేరుకుపోయిన సెస్‌ బకాయిలు

గ్రంథాలయాలకు సెస్‌ రూపంలో, ప్రభుత్వ గ్రాంట్‌ రూపంలో నిధులు సమకూరుతాయి. స్థానిక సంస్థల నుంచి సెస్‌ రూపంలో వచ్చే ఆదాయంతో గ్రంథా లయ నిర్వహణ, కరెంట్‌, వాటర్‌ బిల్లులు, పుస్తకాలు, పేపర్ల కొనుగోలుకు వాడాల్సి ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు ప్రభుత్వం గ్రాంట్‌ విడుదల చేస్తుంది. సెస్‌ వసూలు కాక గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారింది. సకాలంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ రాకపోవడంతో ఉద్యోగుల జీతాలు అందడం లేదు. మొత్తం రూ.80 కోట్ల పై చిలుకు సెస్‌ బకాయిలు పేరుకుపోయాయి. కొన్ని నెలలుగా కరెంట్‌ బిల్లులు, వాటర్‌ బిల్లులు, పేపర్‌ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్ప డింది. గ్రాంట్‌ విడుదల చేస్తే తమ జీతాలు వస్తాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. గ్రంథాలయాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సెస్‌ వసూళ్ల కోసం కాళ్లరిగేలా..

సెస్‌ వసూళ్లకు జీతాలతో లంకె పెట్టడంతో గ్రంథాలయ సిబ్బంది సెస్‌ వసూళ్ల కోసం పంచాయతీలు, మునిసిపల్‌ కార్యాలయాలు, కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సెస్‌ వసూలు చేసుకోండి .. జీతాలు తీసుకోండి అన్న పద్ధతిలో ప్రభుత్వ తీరు ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. జీతాలు సర్దుబాటు చేస్తోందే తప్ప పూర్తిగా ఇవ్వడం లేదంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలకు రూ.1.20 లక్షలు, ఔట్‌సోర్సింగ్‌కు రూ.13 లక్షల గ్రాంట్‌ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇది ఒక నెల జీతాలకు కూడా సరిపోదని ఉద్యోగులు అంటున్నారు. బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఏక కాలంలో చెల్లించాలని కోరుతున్నారు.

7

నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లాకు అభినందనలు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు అందాయి. మహిళలపై జరిగే నేరాల నియంత్రణను అరికట్టడంతో పాటు శారీరక దాడులను నియంత్రించటంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానం నిలిచింది. సమగ్ర నేర నియంత్రణలో సైతం నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లా ఎస్పీలతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఏడో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కృష్ణా జిల్లా పోలీసు శాఖను అభినందించినట్లు ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు కారణంగా ఈ ఘనత దక్కిందని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ, సమర్థమైన బీట్‌ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలతో విధులు నిర్వర్తించటం కారణంగా మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. వీటితో పాటు ప్రజల సహకారం అందుకు తోడ్పడిందన్నారు. కృష్ణాజిల్లాకు ఇంతటి ఘనత వచ్చేందుకు కృషి చేసిన జిల్లా పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలతో పాటు ప్రభుత్వ మన్ననలు పొందేందుకు పాటుపడాలని ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు సూచించారు.

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో 109 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్‌ 1– 8, గ్రేడ్‌ 2 – 18, గ్రేడ్‌ 3 – 33 ఉన్నాయి. ఇవి కాక రికార్డ్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 50 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 200 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం అందించే గ్రాంట్‌ ద్వారా నెల నెలా జీతాలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు డిసెంబర్‌ నెల వరకు జీతాలు చెల్లించారు. డిసెంబర్‌ నెల జీతాలు ఫిబ్రవరిలో పడ్డాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ మూడు నెలల జీతాల బకాయి పడ్డాయి. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందో ళన మొదలైంది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో గ్రంథాలయ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, వివిధ రుణాలకు చెల్లించాల్సిన ఈఎంఐలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్య ఖర్చులు, పెన్షనర్లకు మందులు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు లేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నాలుగేసి నెలలు జీతాలు చెల్లించకపోతే తాము జీవనం సాగించేది ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మేం జీతాల్లేక అవస్థలు పడుతుంటే... తమ శాఖను నిర్వహిస్తున్న నారా లోకేష్‌ మాత్రం ప్రత్యేక విమానాల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ జల్సాలు చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement