రాష్ట్రంలో సుమారు 21 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అప్పటి నుంచి జిల్లాలో సుమారు మూడు వేల మంది వంట కార్మికులం పని చేస్తున్నాం. సకాలంలో బిల్లులు రాకున్నా అప్పులు తెచ్చి వంట చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నాం. ఇప్పుడు స్మార్ట్ కిచెన్‌ల పేరుతో మమ్మల్ని రోడ్డుపాలు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేలాది మంది పని చేస్తున్న ఈ వ్యవస్థను మార్చేస్తే ఎలా? దీనిపై వేలాది మందితో పోరాటం చేస్తాం.
– ఎన్.సీహెచ్.సుప్రజ, ప్రధాన కార్యదర్శి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా


