మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్రీలంకలో ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న కామన్‌వెల్త్ చెస్ చాంపియన్‌షిప్–2026కు తమ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, చెస్ క్రీడాకారుడు ఎన్‌ఎం ఫణికుమార్ అర్బిట్రేటర్‌గా ఎంపికయ్యారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె.జగదీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెస్ చాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, కెన్యా, మలేషియా, మాల్దీవులు, న్యూజి లాండ్, పాకిస్తాన్, స్కాట్‌లాండ్, సింగ్‌పూర్, మారిషస్, శ్రీలంక దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. ఎంపికై న ఫణి కుమార్‌ను ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ, ప్రెసిడెంట్ అడుసుమిల్లి సురేష్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ పాషా, చెస్ క్రీడాకారులు అభినందించారు.
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన పీజీ, ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ ఫలితాలతో పాటు బీఫార్మసీ మొదటి, ఎనిమిదవ సెమిస్టర్, యూజీ మొదటి సెమిస్టర్, రీవాల్యూయేషన్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శుక్రవారం విడుదల చేశారు. వీటిని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని వీసీ తెలిపారు. ఉత్తీర్ణత శాతంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.
పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్, బీఫార్మసీ మొదటి సెమిస్టర్ రీ వాల్యూయేషన్ ఫీజును ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల విద్యార్థులు చెల్లించాలని పరీక్షల నియంత్రణాఽధికారి వీరబ్రహ్మచారి తెలిపారు.


