ఏపీఈసెట్‌లో కృష్ణా విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఏపీఈసెట్‌లో కృష్ణా విద్యార్థుల ప్రతిభ

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

మచిలీపట్నంఅర్బన్‌: ఏపీఈసెట్‌–2026 ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గత నెల 23న జేఎన్‌టీయూ అనంతపురం, ఏపీ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీఎచ్‌ఈ) తరఫున నిర్వహించిన పరీక్షలో డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీతో ప్రవేశాలు పొందనున్నారు. జిల్లా నుంచి మొత్తం 1,050 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,002 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.49గా నమోదైంది. పరీక్షకు 674 మంది బాలురు, 376 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 640 మంది బాలురు, 362 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.36గా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 96.28గా నమోదైంది. ఏపీఈసెట్‌ ఎఫ్‌డీహెచ్‌ అండ్‌ బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ పరీక్షలో గుడివాడ సమీపంలోని మోటూరుకు చెందిన బొడ్డు రామచందు 160 మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు దక్కించుకున్నారు. ఉయ్యూరుకు చెందిన పట్టపు వైష్ణవి 128 మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement