సిండికేట్ సొమ్ము స్వాహా చేశారని వాటాదారుడి ఆరోపణ వైన్ షాపు వద్ద ఘర్షణ వాతావరణం పెట్రోలు పోసుకొని నిరసన తెలిపిన బాధితుడు షాపు క్లోజ్ చేయించి అక్కడే బైఠాయించిన వైనం
జి.కొండూరు: మద్యం సిండికేట్ సొమ్ము వ్యవహారంలో వివాదం తలెత్తడంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఓ వైన్ షాపు వద్ద శుక్రవారం ర్షణ వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళ్తే... ప్రభుత్వం మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించిన సమయంలో 51 మంది సిండికేట్‌గా ఏర్పడి జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం విజయ దుర్గ వైన్‌షాపును దక్కించుకున్నారు. ఈ క్రమంలో విక్రయాలు జరుగుతుండగా సిండికేట్ సొమ్ము పంపకాల వ్యవహారంలో సభ్యుల మద్య వివాదం తలెత్తింది. దీనితో సిండికేట్‌లో కొందరు వ్యక్తులు సొమ్మును స్వాహా చేసి తనకు అన్యాయం చేశారని సిండికేట్ సభ్యుడు ఇబ్రహీంపట్నంకు చెందిన వెల్లంకి సురేష్ అనే వ్యక్తి శుక్రవారం కట్టుబడిపాలెం వైన్ షాపు వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. విక్రయాలు జరపకుండా అడ్డుకొని షాపును క్లోజ్ చేశారు. దీనితో సమాచారం అందుకున్న ఎకై ్సజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని షాపును తెరిపించేందుకు ప్రయత్నింగా తీవ్ర మనస్థాపానికి గురైన సిండికేట్ సభ్యుడు వెల్లంకి సురేష్ పెట్రోలు మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనితో అప్రమత్తమైన ఎకై ్సజ్‌శాఖ అధికారులు బాధితుడు సురేష్‌పై నీళ్లు పోసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకున్నారు. బాధితుడు సురేష్‌కు నచ్చజెప్పి సిండికేట్ సభ్యలతో మాట్లాడి సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత షాపును తెరిపించారు.


