విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026 పులిచింతల సమాచారం నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం హోంగార్డుల పిల్లలకు అభినందన విశాఖ–కొల్లం మధ్య రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌

ఇటీవల కాలంలో పట్టుబడిన బియ్యం

న్యూస్‌రీల్‌

కొండపల్లి కేంద్రంగా కోటా బియ్యం అక్రమ రవాణా నెలకు రూ.కోటికి పైగా సాగుతున్న వ్యాపారం రేషన్‌ అక్రమ వ్యాపారంలో డీలర్లదే ప్రధాన పాత్ర ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న అధికారులు

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.8440 టీఎంసీలు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యా న్నదానానికి విజయవాడ గొల్లపూడికి చెందిన బుర్లే శ్రీనివాసరావు, భ్రమరాంబ దంపతులు గురువారం రూ.1,01,116 విరాళం సమర్పించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న హోంగార్డుల పిల్లలు 21 మందిని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ చూపిన చిన్నారులను కమిషనరేట్‌లో గురువారం శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్‌లోని హోంగార్డుల పిల్లలు 21 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు. రేయింబవళ్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యే హోంగార్డులు, తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని కొనియాడారు. తమ పిల్లల ప్రతిభను గుర్తించి, స్వయంగా పోలీస్‌ కమిషనర్‌ సత్కరించడంతో హోంగార్డులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ డీసీపీ కె.జి.వి.సరిత, హోంగార్డు కమాండెంట్‌ ఆనందబాబు, ఏఆర్‌ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, హోంగార్డు డీఎస్పీ ఎన్‌.వి.రమణ, ఆర్‌ఐ సుధాకరరెడ్డి, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు విజయవాడ, గుంటూరు మీదుగా విశాఖపట్నం – కొల్లం మధ్య రెగ్యులర్‌ వారాంతపు రైలుకు రైల్వే బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖపట్నం – కొల్లం (18501) రైలు ఈ నెల 12 నుంచి ప్రతి మంగళవారం, కొల్లం– విశాఖపట్నం (18502) రైలు ఈ నెల 13 నుంచి ప్రతి బుధవారం నడవనున్నాయి. రెండు మార్గాల్లో ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌ పట్టాయ్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పోదనూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, అలువా, యర్నాకుళం, కొట్టాయం, చెంగనూరు, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది.

కొండపల్లిలో ఉయ్యాల శ్రీను డెన్‌గా ఉన్న ప్రాంతంలో నిల్వ చేసిన సుమారు 40 బస్తాలు బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇతని ప్రాంతానికి వెళ్లేందుకు ఏ అఽధికారీ సాహసం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం గోడౌన్‌ ప్రాంతాన్ని మార్పు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. కొండపల్లి శాంతినగర్‌ వద్ద డేరంగుల గోపీకి చెందిన 550 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఈలప్రోలులో నిల్వ చేసిన సుమారు 15 బస్తాలు, గుంటుపల్లిలో సుమారు 20 బస్తాల కోటా బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇవి కాకుండా యథేచ్ఛగా రవాణా జరుగుతూ లెక్కల్లోకి రాని బియ్యం వందల టన్నుల్లో ఉంటుందని అంచనా ఉంది. పేదల రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు, ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ఇబ్రహీంపట్నం: పేదలకు ఉచితంగా అందించే కోటా (రేషన్‌) బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో దోచుకుంటున్నారు. ఆపై బహిరంగ మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కొండపల్లిలో జరిపిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రేషన్‌ మాఫియా ముఠా కొండపల్లి కేంద్రంగా సాగిస్తున్న దందాను చూసి అధికారులను సైతం విస్మయం చెందారు. దశాబ్దకాలంగా రేషన్‌ డాన్‌గా కొనసాగుతున్న ఉయ్యాల శ్రీను నిల్వ చేసిన సుమారు 40 బస్తాలు రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం డేరంగుల గోపీ నిల్వ చేసిన 550 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంపై అఽధికారులు దాడిచేశారు. గతంలో షాదీఖానలో నిల్వచేసిన టన్నున్నర బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ లెక్కన కొండపల్లి కేంద్రంగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేటతెల్లమవుతోంది.

ప్రతినెలా రూ.కోటికి పైగా వ్యాపారం

కొండపల్లి మునిసిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల పరిధి గ్రామాల్లో కోటా బియ్యంతో ప్రతి నెలా రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు ప్రాంతాల నుంచి అక్రమంగా రేషన్‌ బియ్యం వేల క్వింటాళ్లు తరలిపోతోందని అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ నాయకులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ సంబంధిత వాహనాలు, వ్యక్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేయక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా రేషన్‌ దుకాణాలు తనిఖీ చేస్తున్నప్పటికీ బియ్యం నిల్వలపై తేడాలు ఉన్నా కేసులు నమోదు చేయ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

రేషన్‌ డాన్‌ల మధ్య ఆధిపత్య పోరు

కొండపల్లి ప్రాంతంలో రేషన్‌ బియ్యం దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లడంతో రేషన్‌ బియ్యం డాన్‌ల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఒకరు నిల్వ చేసిన బియ్యాన్ని మరొకరు పట్టిం చడం, ప్రాంతాల వారీగా ఆధిపత్యం చెలాయించడం, ఒకరిపై మరొకరు దాడి చేయించడం వంటి ఘటనలు మండలంలో వెలుగు చూస్తున్నాయి. గతంలో పవిత్ర సంగమంనకు వెళ్లే రోడ్డులో అర్ధరాత్రి వేళ రేషన్‌ డాన్‌లు ఒకరిపై ఒకరు దాడిచేసుకుని పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కిన ఘటనలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం కొండపల్లిలో లభించిన 550 బస్తాల బియ్యం కూడా కావాలని పట్టించినట్లు తేలింది. ఈ ఘటనలో డేరంగుల శ్రీను, దుర్గారావుతో పాటు ఓ రైస్‌ మిల్లు యజమానిపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. రేషన్‌ డాన్‌లు తమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు ఒక్కొరు రూ.50 వేల వరకు అఽధికారులకు ప్రతినెలా ముట్టజెబుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

7

Advertisement
 
Advertisement
Advertisement