సిద్ధార్థ యూనివర్సిటీ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ యూనివర్సిటీ ఫలితాలు విడుదల

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

సిద్ధార్థ యూనివర్సిటీ ఫలితాలు విడుదల స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో శిక్షణ తరగతులు పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అనుమతులు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు వద్దు

పెనమలూరు: మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ ఫలితాలను గురువారం విడుదల చేశారు. వర్సీటీ క్యాంపస్‌లో సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు ఫలితాలను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. 2026–2027 విద్యా సంవత్సరంలో అడ్మి షన్ల కోసం ప్రవేశ పరీక్ష (ఎస్‌ఈఈఈ) నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన ఆరుగురు విద్యార్థులకు నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సును పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్‌ ఇస్తామన్నారు. ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంక్‌ డి.భవదీప్‌, రెండో ర్యాంక్‌ సీహెచ్‌.హర్ష, మూడో ర్యాంక్‌ వి.నాగవెంకటరాకేశ్వర్‌ సాధించారని పేర్కొన్నారు. జేఈఈలో ఉత్తమ మార్కులు సాధించిన బి.శరన్‌, వి.నరసింహశ్రీనివాస్‌, జి.సమీర్‌రాజ్‌కు వంద శాతం ఫీజు రాయతీ వర్తిస్తుందన్నారు. ఈ నెల 13 నుంచి అడ్మిషన్లకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉప కులపతి డాక్టర్‌ ఎ.వి.రత్నప్రసాద్‌, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.పాండురంగారావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.రవిచంద్‌, డీన్‌ వెంకట్రావు, డీన్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.స్వామి పాల్గొన్నారు.

ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, యూనియన్‌ బ్యాంక్‌ సంయుక్త సౌజన్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఈఎస్‌టీఐ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నెల రోజుల వస్త్ర చిత్ర కళ (మగ్గం) శిక్షణ ఈ నెల 11 నుంచి ప్రారంభ మవుతుందన్నారు. 14 రోజుల కాస్ట్యూమ్‌ జువె లరీ శిక్షణ, పదిరోజుల పుట్టగొడుగుల పెంపకం, 12 రోజుల కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 19 నుండి 50 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు, యువతులు శిక్షణ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు టూల్‌ కిట్లు అంద జేస్తామని తెలిపారు. అసక్తి కలిగిన వారు ఈ నెల పదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం 63042 54730, 94900 11081 నంబర్లను సంప్రదించాలని కోరారు.

చిలకలపూడి(మచిలీపట్నం): అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం ఎన్నో పోరా టాలు చేశారని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాలులో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. సీతారామ రాజు మన్యం వీరుడిగా పేరుగడించారన్నారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ డెప్యూటీ కలెక్టర్‌ పోతురాజు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, కలెక్టరేట్‌ ఏఓ ఎ.ఎస్‌.ఎన్‌.రాధిక, సూపరింటెండెంట్‌ నెల్సన్‌పాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: ప్రభుత్వ గుర్తింపు, అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టొద్దని ప్రైవేట్‌ పాఠశాలలను కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గూడూరు మండలంలో ‘ఢిల్లీ వరల్డ్‌ స్కూల్‌’ పేరుతో నిర్వహిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలకు సంబంధిత శాఖల నుంచి సరైన గుర్తింపు, అనుమతులు లేవని స్పష్టంచేశారు. ఆ విద్యా సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దని సూచిం చారు. ఆ పాఠశాలల్లో చేరిస్తే విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుర్తింపు లేకుండా 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ పాఠశాలలు, వాటి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement