దుర్గమ్మ భక్తుల కోసం వాటర్‌ ప్లాంట్‌ వితరణ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ భక్తుల కోసం వాటర్‌ ప్లాంట్‌ వితరణ

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

దుర్గమ్మ భక్తుల కోసం వాటర్‌ ప్లాంట్‌ వితరణ విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కోడూరు: రొయ్యల చెరువుల వద్ద పని చేసే వ్యక్తి విద్యుత్‌ఘాతంలో మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చాణిక్య తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రామకష్ణాపురం శివారు ఇరాలి గ్రామ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద అదే గ్రామానికి చెందిన పేరుబోయిన బాలరామమూర్తి (39) పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం కూడా చెరువు వద్ద పని వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అకాలవర్షం కారణంగా వీచిన గాలులకు విద్యుత్‌తీగలు గట్టుపై పడడంతో ఆ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య నాగలక్ష్మి ఫిర్యాధు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ట్రస్ట్‌ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్‌బాబు, శ్రీదేవి దంపతులు దేవస్థానానికి అందచేశారు. ఘాట్‌రోడ్డులో సుమారు రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను దాత వెలగపూడి శంకర్‌బాబు దంపతులు గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. సుమారు 300 లీటర్ల సామర్ధం కలిగిన ఈ వాటర్‌ప్లాంట్‌ ద్వారా భక్తులకు స్వచ్చమైన తాగునీరు అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం తన కుటుంబానికి కలిగినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement