భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఆకాంక్షించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితే విజయాలు దరి చేరతాయన్నారు. ప్రజల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు నిమగ్నమైన ఉండే సిబ్బంది కుటుంబాల్లోని పిల్లలు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించటం ఎంతో గర్వంగా ఉందన్నారు. అందుకు పిల్లల తల్లిదండ్రులందరినీ జిల్లా పోలీసు శాఖ తరపున అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులతో పాటు జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి.సత్యనారాయణ, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సత్యకిషోర్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement