విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026 మిల్లర్ల తరుగు దందా దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం జన గణనలో లోపాల్లేకుండా చూడండి రేపటి నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు జి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంతో ధాన్యం రైతు పరిస్థితి దయనీయంగా మారింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నరకయాతన పడాల్సి వస్తోంది. అన్ని ఖర్చులు రైతే భరించి మిల్లులకు తరలిస్తే తరుగు పేరుతో మిల్లర్లు క్వింటాకు ఐదు కిలోల కోత విధిస్తున్నారు. ధాన్యం దిగుమతిలో మిల్లర్లు జాప్యం చేయడం, ఖాళీ బస్తాలు ఇవ్వకపోవడంతో రోజుల తరబడి వేల టన్నుల ధాన్యం కల్లాల్లోనే మగ్గుతోంది. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేయడం కూడా కష్టమేనని రైతులు వాపోతున్నారు. రైతే అన్నీ తానై ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో విఫలమవడంతో ఈ ఏడాది రబీలో వరి సాగు చేసిన రైతులు నరకయాతన పడుతున్నారు. ధాన్యం నింపేందుకు మిల్లర్లు బస్తాలను ఇవ్వకపోవడంతో 40 కిలోల ఖాళీ సంచిని రూ.18 చొప్పున వెచ్చించి రైతులే కొనుగోలు చేస్తున్నారు. ధాన్యాన్ని బస్తాలకు నింపి తూకం వేసినందుకు బస్తాకు రూ.9, బస్తాలను మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్లకు టన్నుకు రూ.800 చొప్పున రైతులే చెల్లిస్తున్నారు. ఇదంతా చేసి మిల్లులకు తరలిస్తే మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేయకపోవడంతో రోజలు తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో వాహనాలకు వెయిటింగ్‌ చార్జి కింద రోజుకు రూ.1000 చొప్పున రైతులు చెల్లించాల్సి వస్తోంది. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ఆలస్యం కావడంతో వేల టన్నుల ధాన్యం కల్లాల్లోనే నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఎంటీయూ–1010రకం ధాన్యాన్ని కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రూ.15 కోట్ల మేర దోచేస్తున్నారు.. అన్ని ఖర్చులు రైతులే భరించి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే తరుగు (ధాన్యం ముక్క అవుతోందని) సాకు చూపి క్వింటాకు ఐదు కిలోల చొప్పున మిల్లర్లు కోత విధిస్తున్నారు. ధాన్యం మిల్లులకు వచ్చే ముందే సహకార సొసైటీల సిబ్బంది తేమశాతం పరిశీలించి ట్రక్‌ షీట్‌ను రూపొందిస్తారు. తరుగు కింద కోత విధించిన ధాన్యం విలువను మిల్లర్లు ముందుగానే రైతుల నుంచి తీసుకొని ట్రక్‌షీట్‌ ప్రకారమే దిగుమతి చేసుకుంటున్నట్లు నమ్మిస్తున్నారు. ఒకవేళ రైతు ఐదు కిలోల కోత విధించేందుకు ఒప్పుకోకపోతే ధాన్యం మిల్లులో దింపుకోకుండా వేధిస్తున్నారు. మరో మిల్లుకు తీసుకెళ్లండని తేల్చిచెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక కోత విధించిన విలువ డబ్బులను మిల్లర్లకు రైతులు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,389 కాగా ఐదు కిలోలకు కలిపి రూ.119.45 చొప్పున రైతులు మిల్లర్లకు చెల్లించాల్సి వస్తోంది. ఈ విధంగా ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించే ధాన్యం టార్గెట్‌ 1.20 లక్షల టన్నుల కాగా క్వింటాకు ఐదు కిలోల చొప్పున కోత విధించడం వల్ల రూ.15 కోట్ల వరకు మిల్లర్లు రైతుల నుంచి దోచేస్తున్నారు. కలగర రైస్‌ మిల్లు వద్ద వేచి ఉన్న ధాన్యం లోడు వాహనాలు

న్యూస్‌రీల్‌

ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం సంచులు ఇవ్వకపోవడంతో సొంత ఖర్చుతో కొంటున్న రైతులు ఖర్చంతా భరించి మిల్లులకు తరలిస్తే క్వింటాకు 5 కిలోల కోత ఎంటీయూ–1010 రకం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసిన వైనం కల్లాల్లోనే రోజుల తరబడి నిల్వ ఉన్న వేల టన్నుల ధాన్యం

మద్దతు ధరకు కొనేది అంతంత మాత్రమే

ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ ఏడాది రబీలో 36,934 హెక్టార్లలో వరి సాగు చేయగా 3,33,692 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం సేకరించేందుకు జిల్లాలో 1.20లక్షల టన్నులు మాత్రమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ విధంగా ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం మాత్రమే వరి కోతలు పూర్తికాగా ప్రభుత్వ లక్ష్యంలో 60శాతం ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేశారు. మరో నలభై శాతం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సి ఉంది. ఇది కాకుండా అదనంగా దిగుబడి రానున్న 2,13,692 టన్నుల ధాన్యం పరిస్థితి ప్రశ్నార్థకమే. దీంతో చేసేదిలేక రైతులు ప్రయివేటు వ్యాపారులకు విక్రయించి నష్ట పోతున్నారు.

క్వింటాకు ఐదు కిలోల ధాన్యం దోపిడీ

ఏర్పాట్ల పరిశీలన

హాకర్ల ధర్నా

ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్‌బాబు కుటుంబం మంగళవారం దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరం దాతలకు ఆలయ అధికారి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ఎన్నికల వాగ్దానమైన 50ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఎప్పుడు అమలు చేస్తారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న జనగణనలోని బీసీల గణన అవకతవకలు లేకుండా సక్రమంగా చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రీమిలేయర్‌ ఎత్తేయడం, బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీ, ఏసీబీ/విజిలెన్స్‌ కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలని కోరారు. యాచక, సంచార, అర్ధసంచార, సేవా, సామాజిక వృత్తులు నిర్వహించే బీసీ వర్గాల వారందరి ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా 50 శాతం సబ్సిడీ రుణాలను ఇవ్వాలని విన్నవించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ మూర్తి, యువజన అధ్యక్షుడు పారేపల్లి మహేష్‌ పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: హనుమాన్‌జంక్షన్‌లో ఏటా వైభవంగా నిర్వహించే హనుమజ్జయంతి ఉత్సవాలకు అభయాంజనేయ స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు దేవదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఉదయం హనుమంతునికి సుప్రభాత సేవ, అర్చన, 1008 పూలతో ప్రత్యేక పూజ, 108 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం, సాయంత్రం కోలాటం ప్రదర్శన, వెండి, బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలతో పాటు కళావేదికపై నృత్య, మ్యూజికల్‌, పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 12వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు అంజనీపుత్రునికి పంచామృతాలతో అభిషేకం, ప్రభాత సేవ, అర్చన అనంతరం భక్తులకు దర్శన కల్పిస్తారు. మధ్యాహ్నం లారీ ఓనర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ, సాయంత్రం స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలం పాట, గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

7

ఎ.కొండూరు: మాధవరంలో సీఎం చంద్రబాబు ఈనెల 9న పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు మంగళవారం ఏర్పాట్లు పరిశీలించారు.

సాక్షి విజయవాడ: వీధి విక్రయదారుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ విజయవాడ మునిసిపల్‌ కార్యాలయం వద్ద హాకర్లు ధర్నా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement