కార్మికులపై కక్ష సాధింపు సరికాదు | - | Sakshi
Sakshi News home page

కార్మికులపై కక్ష సాధింపు సరికాదు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఆర్టీసీ యాజమాన్యం కక్షపూరిత చర్యలకు నిరసనగా మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్య అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేసి వెంటనే విధుల్లో తీసుకోవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ధర్నాలో పాల్గొన్న ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ఏలూరులో ఆర్టీసీ నిర్వహించే అవుట్‌లెట్‌ డీజిల్‌ బంకులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. దీనిలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, ఎలాంటి సంబంధం లేని సుందరయ్య అక్రమ సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఫెడరేషన్‌ ప్రతినిధులు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాల సుబ్రహ్మణ్యంను కలిసి చర్చించారు. ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ కట్ట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కానాల గంగాధర్‌ రావు పాల్గొన్నారు.

స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

ఆధ్వర్యంలో ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement