ఆలయాలను చీకట్లోకి నెట్టిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆలయాలను చీకట్లోకి నెట్టిన ప్రభుత్వం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

ఆలయాలను చీకట్లోకి నెట్టిన ప్రభుత్వం

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

పటమట(విజయవాడతూర్పు): హిందూ ధార్మిక సంస్థల్లో భక్తుల భద్రత అగమ్యగోచరంగా మారిందని, ఆలయాల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతివాటం చూపిస్తోందని దేవదాయ శాఖ మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ విజయవాడ పశ్చిమ నియో జకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంతోపాటు ఆలయాలనూ చీకట్లలోకి నెకట్టిందని దుయ్యబట్టారు. పటమటలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హిందువులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. జరగని విషయాలపై శ్రద్ధ చూపే ప్రభుత్వం జరిగిన అంశాలపై చర్యలు తీసుకోకపోవటం శోచనీయమన్నారు. కనకదుర్గమ్మ ఆలయానికి వినియోగించే డీజిల్‌ను సైతం ప్రభుత్వం అమరావతికి మళ్లించడంతో ఇటీవల ఆలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే జనరేటర్లు పనిచేయక భక్తులు చీకటిలో చిక్కుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఆలయ టాయిలెట్‌లోకి ఇటీవల ఓ ఆగంతకుడు వచ్చి మహిళలను అసభ్యంగా ఫోన్‌లో చిత్రీకరించటం, అంతకు ముందు ఓ వ్యక్తి చనిపోవటంపై కూడా కూటమి పెద్దలు మౌనంగా ఉన్నారని దుయ్యబ ట్టారు. డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జరగని విషయంపై వైఎస్సార్‌ సీపీపై దుష్ప్రచారం చేస్తూ దుర్గగుడి మెట్లు కడిగారని, అయితే ఇటీవల ఆలయంలో జరిగిన ఘటనలపై పెదవి విప్పకపోవటం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement