ఆత్మవిశ్వాసమే మూలధనం | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే మూలధనం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

ఆత్మవిశ్వాసమే మూలధనం

భవానీపురం(విజయవాడపశ్చిమ): మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఆత్మ విశ్వాసమే మూలధనంగా ముంద డుగు వేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్‌ ఆధ్వర్యాన శనివారం భారతీయ యువశక్తి ట్రస్ట్‌ భాగస్వా మ్యంతో పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం (ఈడీపీ) జరిగింది. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, రుణ సదుపాయాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారతీయ యువ శక్తి ట్రస్ట్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతను ఉద్యోగ అన్వేషణ నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ ఎ.ఎన్‌.వి.నాంచారరావు, లావణ్య కుమారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement