ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
జనగణన శాఖ సంయుక్త
సంచాలకుడు ప్రసన్నకుమార్
గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో జన గణన జరుగుతున్న ఎన్యూమరేషన్ బ్లాక్ 95ను శుక్రవారం జనగణన శాఖ సంయుక్త సంచా లకుడు ప్రసన్నకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, చార్జ్ ఆఫీసర్లతో సమావేశమైన ఆయన జన గణనపై మార్గనిర్దేశం చేశారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి డ్యాష్ బోర్డ్‌లో రిపోర్టులు ఎలా చూడాలి, డౌన్‌లోడ్ చేయడం, వాటి ఆధారంగా ఎన్యూమరేటర్లకు సూచనలు ఇవ్వడంపై చార్జ్ ఆఫీసర్లకు వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, జనగణన పురోగతిపై సమీక్షించారు. జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. జనగణన లో భాగంగా ఎన్యూమరేటర్లు అడిగే 33 ప్రశ్నలకు ప్రజలు సరైన సమాచారం అందించాలని తెలిపారు. తహసీల్దారు కె.వెంకటశివయ్య, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి కోరారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ ఈ క్యాంపులు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని, మొత్తం 55 క్రీడా విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. క్రీడాకారులందరూ క్రీడా యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని, ఎటువంటి సమస్యలు ఉన్నా యాప్ ద్వారా తెలియజేయవచ్చునన్నారు. కార్యక్రమంలో శాప్ ఎండీ ఎస్.భరణి, శాప్ బోర్డ్ సభ్యులు సంతోష్, రమణరావు, ఏవో వెంకట రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ టౌన్ – హిసార్ మధ్య రెగ్యులర్ వీక్లీ ట్రైన్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు కాకినాడ టౌన్ – హిసార్ మధ్య నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైలును రెగ్యులర్ రైలుగా నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. కాకినాడ టౌన్ – హిసార్ (18295) రైలు ఈ నెల 12 నుంచి ప్రతి మంగ ళవారం, అదే విధంగా హిసార్ – కాకినాడ టౌన్ (18296) రైలు ఈ నెల 15 నుంచి ప్రతి శుక్రవారం రెగ్యులర్ సర్వీసుగా నడవనుంది.


