లబ్బీపేట(విజయవాడతూర్పు): అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఏప్రిల్ 23 నుంచి 25 వరకూ జరిగిన జాతీయ స్థాయి క్రీడా మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు చెస్‌లో సత్తా చాటారు. ఎంబీబీఎస్ 2022 బ్యాచ్‌కు చెందిన ఎం.సాయిదివ్య , 2025 బ్యాచ్‌కు చెందిన టి. వెంకటసాయి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారు. వీరిద్దరూ పురుషులు, మహిళల విభాగంలో ప్రతమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్స్‌తోపాటు, రూ.3 వేలు నగదు బహుమతిని అందుకున్నారు. వారిని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో పాటు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. ప్రశాంతి, డాక్టర్ ఎస్.గోవిందు, డాక్టర్ కె.ప్రభాకరరావు అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ జె. రాము ఉన్నారు.
సందడిగా సంగీత కళాశాల వార్షికోత్సవం
విజయవాడ కల్చరల్: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల 66 వ వార్షికోత్సవాన్ని కళాశాలలోని గోకరాజు గంగరాజు కళా వేదికపై గురువారం నిర్వహించారు. కార్యక్రమాలను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్. మల్లికార్జునరావు ప్రారంభించారు. వార్షికోత్సవం సందర్భంగా వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గా భవానిని ఆత్మీయంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా జరిగిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): గంజాయి కలిగి ఉన్న ఇద్దరు యువకులను కొత్తపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బంగారయ్య కొట్టు సెంటర్‌లో కొంతమంది గంజాయిని కలిగి ఉన్నారని సమాచారం అందింది. దీంతో సెక్టార్ ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా, బంగారయ్య కొట్టు కొండ ప్రాంతానికి చెందిన పొన్నాడ ఏసుబాబు(21), మీసాల పార్థు దుర్గా పరమేష్(18) అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 2.750 కేజీల గంజాయిని గుర్తించారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


