హోరాహోరీగా నెట్‌బాల్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ (మహిళలు) టోర్నమెంట్లో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి లీగ్ పోటీలు మరింత ఉత్కంఠగా సాగనున్నాయి.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లు
టోర్నమెంట్ ప్రారంభమైన మూడో రోజైన సోమవారం జరిగిన నాకౌట్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ, పూణే– స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ హరియాణాపై 49–32 స్కోరుతో విజయం సాధించింది. హేమచంద్ యాదవ విశ్వవిద్యాలయం, దుర్గ్–అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వవిద్యాలయంపై 58–48 స్కోర్‌తో, కాలికట్ యూనివర్సిటీ–మంగళూరు యూనివర్సిటీపై 58–51 స్కోర్‌తో విజయం సాధించాయి.


