బిల్‌గేట్స్‌కు స్వాగతం
కోనేరుసెంటర్: ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక అంశాలపై చర్చించడానికి ఏపీ పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్‌గేట్స్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు సోమవారం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బిల్‌గేట్స్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
పవర్ లిఫ్టింగ్‌లో ‘పేట’ ప్రతిభ
జగ్గయ్యపేటఅర్బన్: రాజమండ్రిలో ఈ నెల 14,15 తేదీల్లో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన 13వ రాష్ట్ర స్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలో జగ్గయ్యపేటకు చెందిన క్రీడాకారుడు షేక్ అబ్దుల్ వహాబ్ ప్రతిభ కనబరిచాడు. 120 కేజీల పవర్ లిఫ్టింగ్ కేటగిరిలో స్క్వాట్–210 కేజీలు, బెంచి ప్రెస్–130 కేజీలు, డెడ్ లిఫ్ట్–200 కేజీలు మొత్తం 540 కేజీలు బరువు ఎత్తి తృతీయ బహుమతిని సాధించినట్లు ఆయన తెలిపారు. పేట సచివాలయ టౌన్‌ప్లానింగ్ విభాగంలో పని చేసే అబ్దుల్ వహాబ్ సోమవారం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ డీటీవీ కృష్ణారావులు అభినందించారు.
బిల్‌గేట్స్‌కు స్వాగతం


