చెట్టుకింద ఉంటున్నాం
జోజినగర్ 42 ప్లాట్లలో మాది 29వ ప్లాటు. 2001లో కొనుగోలు చేశాం. ఇంటి పన్నులు కూడా చెల్లించాం. మూడేళ్ల క్రితం రూ.30 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. స్టే ఉండగానే నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చి నిలువ నీడ లేకుండా చేశారు. చెట్టుకింద ఉంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. మా బాధ చెప్పుకొనేందుకు ఎయిర్ పోర్టు, ఇంటి వద్ద రెండు సార్లు జగనన్నను కలిశాం. పరామర్శకు వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వచ్చారు. మా తరఫున ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. మాకు ధైర్యం ఇచ్చారు. జగనన్నకు రుణపడి ఉంటాం.
– యమున, బాధితురాలు


