
లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకం
పెనమలూరు: లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా ఎన్నికై న లయన్ పర్వతనేని శుభాష్‌బాబును పోరంకి లయన్స్ సేవాభవన్‌లో బుధవారం జరిగిన కార్యక్ర మంలో ఘనంగా సన్మానించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ శాఖలో మూడు దశాబ్దాల పాటు ఇంజినీర్‌గా సేవలు అందించి, లయన్‌గా సేవా కార్యక్రమాలు చేసి 24 ఏళ్ల తరువాత ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా ఎన్నికవటం గర్వకారణమన్నారు. ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా చేసి లయన్స్‌క్లబ్‌లో సేవలు అందించి పేదల కోసం సేవా కార్యక్రమాలు చేసిన శుభాష్‌బాబుకు పదవి రావటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్‌లో వివిధ హోదాల్లో ఉన్న మూల్పూరి ఉపేంద్ర, ఆంజనేయులు, పాపారావు, కె.రమణారావు పాల్గొన్నారు.