
సీపీకి అభినందనలు
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
మధిర: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన కత్తి బాబ్జీ (57) హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. వారిద్దరు ఏడాది కాలంగా వేరుగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన బాబ్జీ ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా మధిరకు చేరుకుని ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం ఉదయం అతను తలుపు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా బాబ్జీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేపట్టారు.
ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత
ఉయ్యూరు రూరల్: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన విద్యార్థి మత్యువాత పడిన ఘటన ఉయ్యూరు మండలం పెదవోగిరాలలో సోమవారం జరిగింది. గ్రామంలోని దళితవాడకు చెందిన బందెల శంకర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు లోకేష్ (17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం స్నేహితులతో కలిసి పుల్లేరు కాలువలో సరదాగా ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అతనితో వెళ్లిన ముగ్గురు ఈత వచ్చినవారు కావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఈత రాని లోకేష్ వంతెన పైనుంచి నీటిలో దూకడంతో ఒక్కసారిగా గుర్రపు డెక్కలో చిక్కుకుపోయాడు. దీంతో ఊపిరాడక మృతి చెందాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఈ ప్రమాదాన్ని గ్రామస్తులకు తెలపడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
అక్రమ మద్యం ఆరోపణలకేసులో బెయిల్ పిటీషన్లు డిస్మిస్
విజయవాడలీగల్: అక్రమ మద్యం ఆరోపణల కేసులో విజయవాడ జిల్లాజైలులో ఉన్న గోవిందప్ప బాలాజీ, శ్రీధర్‌రెడ్డి విడివిడిగా దాఖలుచేసిన బెయిల్ పిటీషన్లను డిస్మిస్ చేస్తూ సోమవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి ప్రత్యేక వసతులు కోరుతూ దాఖలుచేసిన పిటీషన్‌పై జిల్లా జైలు అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. రాజ్ కేసిరెడ్డి తరఫున న్యాయవాది అనుదీప్ వాదనలు వినిపించారు. అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు విచారణను 16వ తేదీకి వాయిదావేశారు. ఈ కేసులో గుంటూరు జైలులో ఉన్న బాలాజీకుమార్ యాదవ్ బ్యారక్ మార్చాల్సిందిగా కోరుతూ దాఖలుచేసిన పిటీషన్‌పై గుంటూరు జిల్లా జైలు అధికారులను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఎస్.వి.రాజశేఖరబాబు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పలువురు పోలీసు అధికారులు సోమవారం ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు మర్యాదపూర్వకంగా కలిశారు.
– లబ్బీపేట(విజయవాడతూర్పు)