
చె
రువు మట్టి..
రబట్టి
పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో జోరుగా మట్టి తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కూటమి నేతలు సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. వారి ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులను చెరబట్టి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిదందా సాగిస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మట్టి దందా సాగుతోంది. ప్రైవేటు వెంచర్లకు మట్టిని విక్రయిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మరో వైపు ఉచిత ఇసుకను కూడా బొక్కేస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు గ్రామం మొదలుకొని పమిడిముక్కల మండలంలోని లంకపల్లి వరకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పేదల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తున్నారు. రోజుకు 400 లారీల ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో, లంకపల్లి చుట్టుపక్కల కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారని రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంతో పాటు, బుడమేరులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూనే ఉన్నారు.
పామర్రు నియోజకవర్గంలో..
పొలాల్లో పూడికతీత, గ్రామాల్లో ఇళ్ల స్థలాల మెరకల పేరుతో కూటమి నాయకులు గ్రామాల్లో చెరువులను, కుంటలను చెరబట్టారు. చెరువులు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సైతం మామూళ్లు తీసుకుంటూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పామర్రు, ఉయ్యూరు ప్రాంతంలోని ప్రైవేటు వెంచర్లు, ఇళ్ల స్థలాల మెరకు మట్టి తరలిస్తున్నారు. కొన్ని చెరువుల్లో ఇప్పటికే మట్టి అక్రమ తవ్వకాల ద్వారా కోట్ల రూపాయల దోపిడీని పచ్చనేతలు చేశారు. ఒక్కో చెరువులో మట్టి తరలింపు ద్వారా కోటి రూపాయలకు పైగా దోచుకున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.
గుడివాడ నియోజక వర్గంలో..
గుడివాడ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూ, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. బుడమేరులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తవ్విన మట్టిని ఓ ఇంటర్‌నేషనల్ స్కూల్‌కు తరలిస్తున్నారు. నందివాడ మండలంలో వెన్ననపూడి, ఇలపర్రు గ్రామ చెరువుల్లోనూ మట్టి అక్రమ తవ్వకాలు జోరుగాసాగుతున్నాయి. గుడివాడ మండలంలో లింగవరం, నాగవరప్పాడు, బిళ్లపాడు, సిరిసింతల, కలువపూడి అగ్రహారం, మోటూరు గ్రామ చెరు వుల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. గుడ్లవల్లేరు మండలంలో విన్నకోట గ్రామ చెరువులో యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారు. ఈ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు.
అక్రమంగా చెరువుల్లో మట్టి తవ్విప్రైవేటు వెంచర్లకు తరలింపు పామర్రు నియోజకవర్గప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే తవ్వకాలు అధికారం అండతో రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు

చె