
రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం
ఉయ్యూరు: పోలీసులు దాడులు నిర్వహించి రెండున్నర కిలోల గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఉయ్యూరు సీఐ మహమ్మద్ హబీబ్‌బాషా కథనం మేరకు.. ఉయ్యూరు చెరుకు పరిశోథనాస్థానం శివారులో గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ గణేస్‌కుమార్, పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి ఉయ్యూరు పట్టణానికి చెందిన షేక్ సుభాని, ఎండి రెహమాన్, సయ్యద్ మూస, అబ్దుల్ అమీర్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాలో భాగస్వాములైన మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ హబీబ్‌బాషా తెలిపారు.
నలుగురు వ్యక్తులు అరెస్ట్