ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గమ్మకు ఎర్ర కలువలతో అర్చన జరిగింది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అర్చన నిమిత్తం తీసుకువచ్చిన పుష్పాలతో ఆలయ అధికారులు ఊరేగింపు నిర్వహించారు. తొలుత ఈఓ భ్రమరాంబ, ప్రధాన అర్చకుడు ఎల్.డి.ప్రసాద్, ఉభయదాతలు, భక్తులు పూలతో వేదిక వద్దకు చేరుకున్నారు. అమ్మ వారికి అర్చకులు ఎర్రకలువలు, మందార పూలతో అర్చన, పంచహారతుల సేవ నిర్వహించారు.