30 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

30 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి

Mar 26 2023 1:42 AM | Updated on Mar 26 2023 1:42 AM

చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన పంట నష్టం అంచనాలను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆదేశించారు. తన చాంబర్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య శాఖలకు సంబంధించిన సమస్యలపై అధికారులతో చర్చించారు. జాయింట్‌ కలెక్టర్‌ అపరాజితసింగ్‌, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవర్ధక శాఖల అధికారులు మనోహరరావు, జ్యోతి, ఎన్‌.శ్రీనివాసరావు, కె.చంద్రశేఖరరావు, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ జన్ను రాఘవరావు, కమిటీ సభ్యులు శ్రీకాకోళపు నాగేశ్వరరావు, పెన్నేరు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement