
సంప్రదాయ పంజాబీ నృత్యాలు ఉత్సాహం నింపాయి. కళాకారులు సంప్రదాయ వేష, వస్త్రధారణతో సంగీతానికి అనుగుణంగా నర్తించి ఆకట్టుకున్నారు. రైతులు సామూహికంగా జరుపుకొనే భాంగ్రా, మహిళలు మాత్రమే చేసే మల్వాయ్ గిద్వా, వివాహ సమయంలో బంధు వులను ఉత్తేజ పరిచే ఝూమర్ నృత్యాలను మనోహరంగా ప్రదర్శించారు. పంజాబ్‌లోని ధనౌలా ప్రాంతానికి చెందిన రూపీందర్ సింగ్ బృందం ప్రదర్శించిన ఈ నృత్యాలు అబ్బురపరిచాయి. ముమ్మనేని సుబ్బారావు సిద్థార్థ కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాపీఠం అద్యక్షుడు పాలడుగు లక్షణరావు, ఉపాధ్యక్షుడు వి.నాగభూషణరావు, కార్యదర్శి బి.వి.ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
– విజయవాడ కల్చరల్
