కోనేరుసెంటర్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బందరు మండలం రుద్రవరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల (బాలురు)లో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.అనిల్‌కుమార్ శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఐదు, ఇంటర్మీడియెల్ మొదటి సంవత్సరంలో చేర్పించేందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం)లో 80 సీట్లు, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం (ఇంగ్లీషు మీడియం)కు సంబంధించి ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. బాలురకు మాత్రమే సీట్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు జిల్లా వాసులై ఉండాలన్నారు. సీట్లు భర్తీ పూర్తిగా ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి పిల్లలకు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. 5వ తరగతికి సంబంధించి http://apfpcet.apc-frr.in లోను, ఇంటర్ దరఖాస్తుకు సంబంధించి http://apfpcet.apc-frr.in/inter లో తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు.