
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యులుగా నైతిక విలువలు పాటిస్తూ ప్రాక్టీస్ చేసినప్పుడే వృత్తిలో రాణించగలుగుతారని ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అన్నారు. నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో గురువారం ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నైతిక విలువలు పాటిస్తూ ప్రాక్టీసు చేయడంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ నేటి వైద్యం మెకానికల్‌గా మారిపోయిందన్నారు. రోగిని ఫిజికల్‌గా ఎగ్జామినేషన్ చేయకుండా, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ల రిపోర్టుల ఆధారంగా వైద్యం చేయడం ప్రారంభించారన్నారు. అలా కాకుండా ముందు రోగికి వైద్యులు ఇంటరాక్ట్ అవ్వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కంచర్ల సుధాకర్, సైకియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యూయేట్ విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.
ప్రీ క్వార్టర్స్‌కు
రాష్ట్ర హ్యాండ్‌బాల్ జట్టు
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ హ్యాండ్‌బాల్ జూనియర్ బాలికల పోటీల్లో రాష్ట్ర జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. పూల్–ఈలో ఉన్న జట్టు అదే పూల్‌లోని ఉత్తరాఖండ్ జట్టును 19–0 తేడాతో ఈ నెల 22వ తేదీన ఓడించింది. 23వ తేదీన అసోం జట్టును 25–6 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. జాతీయ పోటీల్లో రాణిస్తున్న జట్టు బృందాన్ని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు అభినందించారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి