జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

పాఠశాలల పున:ప్రారంభం

రోజే పంపిణీ

ఈనెల 15 నుంచి బడులకు సరఫరా

జిల్లాలోని పాఠశాలలు 1193

వచ్చిన పాఠ్యపుస్తకాలు 6,05,950

రావాల్సినవి.. 86,700

నేరుగా పాఠశాలలకే..

ఖలీల్‌వాడి: ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బడుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించింది. పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్‌లను బడుల ప్రారంభం రోజు విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 80 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాముకు చేరాయి. ఈనెల 15 నుంచి జిల్లాలోని మండల పాయింట్లకు చేర్చేలా అధికారులు చర్య లు చేపడుతున్నారు. అయితే పుస్తకాలను మండల పాయింట్‌కు రవాణా చేసేందుకు నిధులు లేకపోవడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది.

జిల్లాలో 769 ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు 132, జిల్లా, మండల పరిషత్‌ స్కూళ్లు 255, కేజీబీవీలు 27, మోడల్‌ స్కూళ్లు 10 ఉన్నాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్‌లు ఉచితంగా పంపిణీ చేస్తారు.

6 లక్షల 92 వేల 650 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 6 లక్షల 5 వేల 950 పుస్తకాలు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీలో కొంత ఆలస్యమైంది. గతేడాది మాదిరిగా కాకుండా ముందుగానే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా పుస్తకాల పంపిణీకి గడువు సమీపిస్తుండటంతో పూర్తిస్థాయిలో సరఫరా అవుతా యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాల ఎంఈవోలు గోదాం నుంచి పుస్తకాలను తీసుకెళ్తుండగా, దూర ప్రాంతాల మండలాలకు సకాలంలో సరఫరా చేస్తే విద్యార్థులకు మొదటి రోజే పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయి పుస్తకాలు ఇంకా పూరిస్థాయిలో సరఫరా కాలేదు. సకాలంలో పుస్తకాలు పాఠశాలలకు చేరుకుంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇబ్బందులు కలగకుండా..

పాఠశాలల పున:ప్రారంభానికి ముందే పు స్తకాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు విడతల వారీగా చేరుకున్నా యి. ఇప్పటి వరకు 6 లక్షల 5 వేల 950 పుస్తకాలు వచ్చాయి. మిగతావి వచ్చిన వెంటనే యూడైస్‌ ప్ర కారం మండలాల వారీగా పంపుతాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.

పార్శి అశోక్‌, డీఈవో, నిజామాబాద్‌

జిల్లాకు తెలుగు, ఉర్దూ మీడియం పార్ట్‌–1 పుస్తకాలు చేరగా.. మొదటి విడతగా జూన్‌లో పంపిణీ చేయనున్నారు. నాలుగైదు నెలల తర్వాత పార్ట్‌– 2 పుస్తకాలు రానున్నాయి. తెలుగు, ఉర్దూ ఒకవైపు ఉండగా, ఇంగ్లిష్‌ మరోవైపు ముద్రించి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి పుస్తకాలు ఒకేసారి సరఫ రా అవుతాయి.

నోట్‌బుక్‌లు నేరుగా పాఠశాలలకే సరఫరా కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement