● ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
బెంగాల్‌లో మమతా బెనర్జీ అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారు. అసోం, పుదుచ్చేరిలోనూ బీజేపీ గెలవడం మంచి పరిణామం. బెంగాల్‌లో మాత్రం బీజేపీ చరిత్ర సృష్టించింది. ఊహించిన దానికంటే భారీ మెజారిటీ దక్కించుకోవడం సంతోషకరం. బెంగాల్ ప్రజలు భయం, అవినీతి, అశాంతి పై తిరుగుబాటు చేసి.. అభివృద్ధి, పారదర్శకత, భద్రతను కోరుకున్నారు. ఈ తీర్పుతో దేశ రాజకీయాల్లో సరికొత్త దిశ మొదలైంది. రాను న్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. ప్రస్తుత ఫలితాలు ప్రజల ఆలోచన విధానా న్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోయింది. అసోంలో మరోసారి అభివృద్ధికి పట్టం కట్టారు.


