పొరపాట్లు లేకుండా ఎస్‌ఐఆర్ చేపట్టాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్‌అర్బన్: ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి శనివారం వీసీలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మొదట కేటగిరి ఏ ఓటరు జాబితాను బీఎల్‌వో యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సీ, డీలను కేటగిరి ‘ఏ’ కు లింక్ చేస్తామన్నారు. పొరపాట్లకు తావు లేకుండా, దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, ప్రతి రోజూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, హౌసింగ్ పీడీ పవ న్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వా ల్, సిబ్బంది సాత్విక్, జితేందర్ పాల్గొన్నారు.


