
మంజూరైంది.. ఇక ముందుకు
సవాళ్లు ముందున్నాయి..
● గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి సాంకేతిక విద్య
● తెయూలో ఇంజినీరింగ్ కళాశాల
మంజూరుతో నెరవేరిన ఆకాంక్ష
● నాలుగు కోర్సులు.. 264 సీట్లు
● మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ
● కంప్యూటర్ సైన్స్‌లో ఆధునిక కోర్సులు
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ వర్సిటీలో రాష్ట్ర ప్ర భుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. యూనివర్సిటీ ఏర్పడిన కొత్తలో మొదటి వీసీగా పని చేసిన ప్రొఫెసర్ కాశీరాం వర్సిటీలో సాంప్రదా య కోర్సులతోపాటు సాంకేతిక కోర్సులు ఉంటే బాగుంటుందని భావించారు. అప్పటి నుంచే ప్ర ణాళికలు సిద్ధం చేయగా, సుమారు 18 ఏళ్ల తర్వాత కల నెరవేరింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబా ద్ జిల్లాలకు చెందిన గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తోంది. కంప్యూ టర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నా లుగు కోర్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. కోర్సుకు 60 సీట్లతోపాటు ఈడబ్యుఎస్ కోటా కింద 6 చొప్పున మొత్తం 264 సీట్లు అందుబాటులో ఉ న్నాయి. మూడో విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వా రా సీట్లను భర్తీ చేయనున్నారు.
వెబ్ ఆప్షన్స్
విద్యార్థులు ఈనెల 5, 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో 162 క్రమసంఖ్యలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు ‘టీయూసీఈ’ కోడ్ కేటాయించారు. ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన వారు ప్రభుత్వం నిర్ణయించిన రూ.50వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. 10వేల లోపు ర్యాంకు సాధించిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు. 10వేలకు పైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పోను కేవలం రూ.15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నిరంతర పర్యవేక్షణ అవసరం
ప్రస్తుతం ప్రవేశ పెట్టి న నాలుగు కోర్సులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులని చెప్పొ చ్చు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకని వారికి సరైన బోధన అందించేందుకు క్వాలిఫైడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీని ఎంపిక చేయాలి. తగినంత కంప్యూటర్ ల్యాబ్స్ సౌకర్యం కల్పించాలి. విద్యార్థులకు రెగ్యులర్ సిలబస్ తో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలపై పూర్తి పట్టు ఉండేటట్లు సిలబస్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసిద్ధి చెందిన కంపెనీలతో వర్సిటీ ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై వర్సిటీ ఉన్నతాధికారు లు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ ప్రమాణాలు చాలా వరకు తగ్గిపోయాయని పలు రిపోర్టులు, రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఉపాధి పొందేందుకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడ్డాయని తెయూ ఇంజినీరింగ్ కళాశాల కూడా అదే దారిలో ప్రయాణిస్తే ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకత మరుగున పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ అధికారులు ఇంజినీరింగ్ సిలబస్, బోధనా పద్ధతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు అందించడం, ఉద్యోగాల కల్పనపై జాగ్రత్తలు వహించాలని విద్యా వేత్తలు సూచిస్తున్నారు.
డిమాండ్ ఉన్న కోర్సులు..
ప్రస్తుతం మంజూరైన నాలు గు కంప్యూటర్ కోర్సులు ప్రస్తుతం మార్కెట్‌లో బా గా డిమాండ్ ఉన్నవి. విద్యా ర్థులు ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తాం. – సీహెచ్ ఆరతి. ప్రిన్సిపాల్
అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు..
ప్రస్తుతం తెయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారు. ఐదుగురు రెగ్యులర్ అధ్యాపకుల్లో ఒకరు సీనియర్ ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. – ఎం.యాదగిరి, రిజిస్ట్రార్, తెయూ

మంజూరైంది.. ఇక ముందుకు

మంజూరైంది.. ఇక ముందుకు